బీజేపీ కండువాలు కప్పుకున్న టీడీపీ ఎంపీలు

  • బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జేపీ నడ్డా
  • ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం

పొద్దుటి నుంచీ వార్తలొస్తున్నట్టుగానే, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లకు శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాలను నడ్డా అందజేశారు.