r krishnaiah

బిసి రిజర్వేషన్లు తగ్గిస్తూ జారి చేసిన అర్దినెన్సును ఉపసంహరించుకోవాలి : ఆర్.కృష్ణయ్య డిమాండ్

గ్రామ పంచాయత్, ఎంపిటిసి, జడ్పిటిసి లలో బిసి రిజర్వేషన్లు 34 శాతం నుంచి 23 శాతం కు తగ్గిస్తూ పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరిస్తూ వర్నర్ ద్వారా జారి చేసిన అర్దినేన్సును ఉపసంహరించుకోవాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తదేమీ కాని, ఇది 2010 లో వచ్చిందని ఈ తీర్పు వచ్చిన తర్వాత 2013 లో గ్రామ పంచాయితి ఎన్నికలు, 2014 ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే పద్దతిలో జరుపాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే ఎన్నికలు మూడు నెలలు వాయిదా వేసి పార్లమెంటు లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు పదే, పదే బిసి రిజర్వేషన్లకు అడ్డు తగులుతున్నందున ఈ సమస్య అధిగమించడానికి రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ రిజర్వేషన్లను కొనసాగించడానికి రెండు ప్రత్యామ్యాయ మార్గాలు వున్నాయి. మొట్టమొదలు జనవరిలోగా ఏన్నికలు జరపాలనే హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పిల్ చేసి ఏన్నికలు వాయిదా వెయాలి. ఇక రెండవ దశలో ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్షాన్ని డిల్లికి తీసుకు వెళ్లి ప్రధానమంత్రి తో చర్చలు జరిపి పార్లమెంటులో రాజ్యంగా సవరణ బిల్లు పెట్టించాలని కోరారు.

ఇక తాత్కాలికంగా హై కోర్టులో రివ్యు పెటిషన్ దాఖలు చేసి ఈ ఒక ధఫా 34 శాతం కోన సాగించాలని ప్రత్యేకంగా కోరాలి. ఈ రెండు అవకాశాలను వినియోగిస్తే బి.సి. లకు న్యాయం జరుగాతుందన్నారు. బిసి లకు అన్యాయం జరగకుండా చర్చలు తీసుకోవాలని కోరారు. ఒక పక్క అడ్వకేట్ జనరల్ హై కోర్టు లో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతంకు తగ్గిస్తున్నట్లు అప్పిడవిట్ దాఖలు చేశారూ. ప్రభుత్వం బిసి. రిజర్వేషన్లను 34 శాతం కొనసాగిస్తూ ఆర్డినేన్సు జారిచేస్తున్నట్లు పత్రీకల ద్వార ప్రచారం చేస్తున్నారు. పంచాయత్ రాజ్ చట్టంలోనే బిసి ల కు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయలని వుందని అయన అన్నారు.