news about bala saibaba death

బాలసాయిబాబా కన్నుమూత

కర్నూలు జిల్లాకు చెందిన బాలసాయిబాబా కన్నుమూశారు. గుండెపోటుతో బంజారాహిల్స్లోని విరించి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. బాల సాయిబాబా ఎంత పేరు ప్రఖ్యాతులు గడించారో, అంతగానూ వివాదాస్పదుడయ్యారు. అయినప్పటికీ బాల సాయిబాబాకు కర్నూలు జిల్లాలోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ అనేకమంది భక్తులున్నారు.

1960 జనవరి 14న కర్నూలులో అయన జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు ఆశ్రమవాసులు అంటుంటారు. తన 18వ ఏట ఆశ్రమాన్ని స్థాపించిన ఆయన బోధనల పట్ల ఎంతో మంది ఆకర్షితులయ్యారు. ప్రతియేటా మహాశివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్నారు. గతంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవి. మరోవైపు బాలసాయిబాబా అనేక వివాదాలలో మునిగిపోయారు. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు వచ్చాయి. ట్రస్ట్ పేరుతో భారీగా ఆస్తులు కూడగట్టారని కుడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు.

కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిధులిచ్చిన ఆయనకు డాక్టర్ ఆఫ్ డివైనిటీ, అంబాసిడర్ ఆఫ్ పీస్, హాననరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లాస్, హానరరీ డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ లాంటి గౌరవాలు దక్కాయి.

Tags: news about, bala saibaba, death, kurnool sai baba