బాలయ్య చిన్నల్లుడు బకరా అయ్యారా!

బాలయ్య చిన్నల్లుడు బకరా అయ్యారా!

రాజకీయంలో చంద్రబాబు నాయుడు తన బంధుగణాన్ని అవసరాల మేరకు వాడుకోవడం, ఆ తర్వాత శంకరగిరి మాన్యాలు పట్టించడం కొత్త ఏమీకాదని అంటారు పరిశీలకులు. ఈ పరంపరలో తాజా వంతు బాలయ్య చిన్నల్లుడు భరత్ ది అనే టాక్ వినిపిస్తూ ఉంది. విశాఖ ఎంపీ టికెట్ విషయంలో భరత్ పేరును ఖరారు చేసి చంద్రబాబు నాయుడు మరోసారి నందమూరి కుటుంబీకుల సంబంధింకులను వెర్రివాళ్లుగా చేస్తున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది.

చుండ్రు సుహాసిని వ్యవహారం మరిచికపోక ముందే ఇప్పుడు బాలయ్య చిన్నల్లుడు భరత్ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. విశాఖలో జనసేన అభ్యర్థి లక్ష్మినారాయణకు తెలుగుదేశం పార్టీ లోపాయి కారీగా సహకరిస్తూ ఉందనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

అసలుకు లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. అయితే ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరితే.. పూర్తిగా గుట్టు రట్టు అవుతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అది అనుకూలతగా మారే అవకాశం ఉందని స్పష్టం అయ్యింది. అందుకే ముందుగా లీకుల రూపంలో వార్తలు వచ్చారు. దానిపై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో.. తెలుగుదేశం పార్టీ డివిజినల్ కార్యాలయంగా సాగుతున్న జనసేనలోకి లక్ష్మినారాయణను పంపడం, అక్కడ టికెట్ ఖరారు అయిపోవడం చకచకా జరిగిపోయింది.

ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ విజయం కోసం జనసేన సహకరించడం, అందుకు ప్రతిగా జనసేన తరఫున పోటీచేసే వాళ్లకు కూడా పవన్ కల్యాణ్ కొంత సహకారం అందించడం అనే ఒప్పందం మేరకు.. లక్ష్మినారాయణ విజయం కోసం తెలుగుదేశం పార్టీ సహకరిస్తోందనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో… బాలయ్య చిన్నల్లుడు భరత్ ను బకరా చేసేందుకు కూడా బాబు వెనుకాడటం లేదని ప్రచారం జరుగుతూ ఉంది.

విశాఖలో తెలుగుదేశం శ్రేణులు జనసేన అభ్యర్థి లక్ష్మినారాయణకు సహకరించే అవకాశాలున్నాయని.. భరత్ పోటీలో ఉన్నా లేనట్టే.. అని భరత్, లక్ష్మినారాయణల మధ్య చీలేది జగన్ వ్యతిరేక ఓటే కాబట్టి.. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ఆ పరిస్థితి తలెత్తకుండా.. లక్ష్మినారాయణకు తెలుగుదేశం శ్రేణులు సహకరం అందించి, భరత్ ను అసలు పోటీలో లేకుండా చేసే వ్యూహం అమలు అవుతోందని టాక్!