ఫిల్మ్ నగర్ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ నటుడు

  • పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
  • దొరికిపోయిన 108 మంది
  • 62 కార్లు, 46 బైకులు స్వాధీనం

మందు కొట్టి కార్లు, ద్విచక్ర వాహనాలను నడపవద్దని పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ, మందుబాబులు మారడం లేదు. నిన్న రాత్రి హైదరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలోని పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులకు 108 మంది వాహనదారులు పట్టుబడ్డారు. పలు చోట్ల రోడ్లకు బారికేడ్లను అడ్డుపెట్టిన పోలీసులు, ఆ మార్గంలో వస్తున్న కార్ల డ్రైవర్లను, ద్విచక్ర వాహనదారులను బ్రీత్ అనలైజర్ తో పరీక్షించారు. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 30 కన్నా ఎక్కువ వచ్చిన వారి వాహనాలు స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు పెట్టారు.

ఫిల్మ్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ అజీజ్ మందు కొట్టి వాహనం నడుపుకుంటూ వచ్చి పట్టుబడ్డాడు. అతని రీడింగ్ 108గా వచ్చింది. ఆయన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు పెట్టి, కౌన్సెలింగ్ కు రావాలని ఆదేశించారు. నిన్నటి తనిఖీల్లో మొత్తం 62 కార్లు 46 బైకులు పట్టుబడ్డాయని వెల్లడించిన ట్రాఫిక్ అధికారులు, అందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు.