'ఫణి' తుపాను నేపథ్యంలో చంద్రబాబుపై సెటైర్ వేసిన విజయసాయి

‘ఫణి’ తుపాను నేపథ్యంలో చంద్రబాబుపై సెటైర్ వేసిన విజయసాయి

Share This

చంద్రబాబు శాటిలైట్లతో నేరుగా సంభాషిస్తారు
ఆయన ఏంటెన్నాలు రాడార్లకంటే బలమైన సిగ్నల్స్ తో పనిచేస్తాయి
‘ఫణి’ తుపాను విషయంలో శాస్త్రవేత్తలు చంద్రబాబు సలహాలు తీసుకోవాలి
వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యభరితమైన విమర్శలు చేయడంలో ముందుంటారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యర్థులపై సెటైర్లే ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా, ముంచుకొస్తున్న ‘ఫణి’ తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై సెటైరికల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు శాటిలైట్లతో నేరుగా సంభాషించగల సత్తా ఉన్న వ్యక్తి అని, ‘ఫణి’ తుపాను దిశను అంచనా వేయడంలో వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు ఆయన సలహాలు స్వీకరిస్తే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.

చంద్రబాబు ఏంటెన్నాలు రాడార్ల కంటే బలమైన సంకేతాలు పంపుతాయని ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాను సమయంలో కూడా తాను చెప్పిన చోటే తుపాను తీరం దాటిందని సొంత డబ్బా కొట్టుకున్నారంటూ విమర్శించారు.