ప్రశ్నాపత్రం లీకేజీలో ట్విస్ట్‌.. ఆ పరీక్షలతో మాకు సంబంధం లేదు: ఏపీపీఎస్సీ

వచ్చింది.  పరీక్షలు ప్రభుత్వమే నిర్వహించిందని, సంబంధిత శాఖలే స్పష్టత ఇవ్వాలని,  గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియతో తమకు ఎలాంటి సంబధం లేదన్నారు. ఏపీపీఎస్సీలోనే అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ప్రశ్నాపత్రం లీకైందని , ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టాప్ ర్యాంకులు వచ్చాయని, ప్రశ్నాపత్రం  లీకైందని , ఆరోపణలున్నాయి.  కమిషన్ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని, పేపర్ లీకేజీ కారణంగానే వారి కుటుంబ సభ్యులకు టాప్ ర్యాంకులు వచ్చాయని ఆరోపణలున్నాయి. అయితే ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.  అసలు ఆ పరీక్షలతో సంబంధం లేదని ఏపీపీఎస్సీ చెబుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పేపర్ లీకేజీ వ్యవహారం తమకు తెలియదని, పరీక్ష నిర్వహించిన పంచాయతీరాజ్ శాఖ అధికారులే వివరణ ఇవ్వాలని ఉదయ్ భాస్కర్ పేర్కొనడం గమనార్హం.