ప్రతీ బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు ఇంకా ఎందుకు వేయలేదంటే?: క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

ప్రతీ బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు ఇంకా ఎందుకు వేయలేదంటే?: క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

డబ్బు వేసేందుకు మరింత సమయం పడుతుంది
కేంద్రం దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు
ఆర్బీఐని అడిగితే సహకరించడం లేదు
అధికారంలోకి వస్తే ప్రతీఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచి పెడతామని వ్యాఖ్యానించారు. అయితే ఈ హామీపై ప్రతిపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే స్పందించారు.

ప్రతీ పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేయడానికి ఇంకా సమయం పడుతుందని మంత్రి అథావలే తెలిపారు. ప్రజలకు ఒక్కసారిగా ఇవ్వడానికి అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని వ్యాఖ్యానించారు. సాయం చేయాలని రిజర్వు బ్యాంకును కోరినా సానుకూలంగా స్పందించలేదని వాపోయారు.ఒకవేళ అంత మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు ముందుకొచ్చినా, ప్రజలకు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనే ఎక్కువ స్థానాలు దక్కించుకుంటుందని జోస్యం చెప్పారు.