ఓపక్క చంద్రబాబు ప్రచారం జరుగుతుండగానే... మరోవైపు ఐటీ దాడులు

పోలింగ్‌కు ముందురోజు.. బాబు ‘భారీ’ డ్రామా

   

అమరావతి : ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంలో మునిగివున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సరిగ్గా పోలింగ్‌కు ఒకరోజు ముందు.. కొత్త డ్రామాకు తెరతీయబోతున్నారా? గత ఐదేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చకుండా.. ప్రజలను పట్టించుకోకుండా.. ఊహల్లో ఊరేగిన నారావారు.. ఎన్నికలకు 24 గంటలముందు ప్రజల్లో సానుభూతి కోసం చీప్‌ట్రిక్స్‌ ప్లే చేయబోతున్నారా? అందుకు తగ్గట్టు బాకా ఊదేందుకు, చంద్రబాబు పోరాటం అహో.. ఓహో అంటూ ఊదరగొట్టేందుకు ఎల్లో మీడియా సిద్ధమైందా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ సన్నిహిత వర్గాలు.

పోలింగ్‌కు ఒక్క రోజు ముందు చంద్రబాబునాయుడు సరికొత్త నాటకానికి తెర ఎత్తుతున్నారని, ఎన్నికల సంఘం వైఖరిని వ్యతిరేకిస్తున్నానంటూ విజయవాడలో ఆకస్మిక ధర్నాకు చంద్రబాబు దిగబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు మరికాసేపట్లో ఈసీకి ఫిర్యాదు చేయనున్నారని, అనంతరం ఆయన ఆందోళనకు దిగుతారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విజయవాడలోని సీఈసీ కార్యాలయం వద్ద లేదా నేలపాడులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చంద్రబాబు ధర్నా చేస్తారని, ఈ ఆందోళనలో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తే.. పోలింగ్‌ వేళ సానుభూతి వస్తుందని, కొన్ని ఓట్లు తమకు అనుకూలంగా రాలుతాయని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ ధర్నా ముసుగులో రాష్ట్రంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు పచ్చ పార్టీ శ్రేణులు పథకాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ప్రజల్లో చంద్రబాబు పాలన పట్ల భారీ వ్యతిరేకత ఉండటం, ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించడంతో చంద్రబాబు ఈమేరకు ఎన్నికల వేళ చీప్‌ ట్రిక్స్‌కు దిగుతున్నారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం సందర్భంగా కళ్లు తిరిగి పడిపోతారని ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అరెస్టు డ్రామాకు ఎల్లో గ్యాంగ్‌ తెరతీసిందని, బాబు ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ ధర్నా డ్రామాను రక్తికట్టించే పనిలో ఎల్లో మీడియా ఇప్పటికే తలమునకలైందని సమాచారం.