పొలిటిక‌ల్ బ్రేకింగ్.. వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న.. ఇద్ద‌రు టీడీపీ మంత్రులు..?

పొలిటిక‌ల్ బ్రేకింగ్.. వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న.. ఇద్ద‌రు టీడీపీ మంత్రులు..?

Share This

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం స‌ర్వ‌త్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే గెలుపు ఓట‌ముల పై టీవీ చాన‌ళ్ళ‌లో డిబేట్‌ల మీద డిబేట్లు పెడుతున్నారు. టీడీపీ మ‌రోసారి అధికారం మాదంటే.. వైసీపీ ఈసారి మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని, ప్ర‌భుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారు. ఇక జ‌న‌సేన కూడా గెలుపు విశ్వాసం వ్య‌క్తం చేస్తుంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు మాత్రం మ‌న‌కెందుకులే అని కామ్‌గా ఉన్నారు.
ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. టీడీపీ నేత‌లు ఇప్ప‌టి నుండే వైసీపీ వైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు దాదాపుగా వైసీపీ వైపే ఉంటాయ‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ మ‌ధ్య చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు చూస్తూ.. టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని అర్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఇంకా పార్టీలోనే ఉంటే త‌మ రాజ‌కీయ‌భ‌విష‌త్తుకి ప్ర‌మాదం వ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో, టీడీపీ నుండి జంప్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం.

ఈ జంపింగ్ లిస్ట్‌లో ఉత్త‌రాదికి చెందిన ఒక మంత్రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన మరో మంత్రి.. ఈ ఇద్ద‌రు మంత్రులు వైసీపీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అస‌లు ఈ ఇద్ద‌రు నేత‌లు ఎన్నిక‌ల ముందే వైసీపీలో చేరేందుకు సిద్ధ మ‌య్యారు. అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీలో చేరినా టిక్కెట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మ‌ని చెప్ప‌డం, మ‌రోవైపు చంద్ర‌బాబు బుజ్జ‌గింపులు, అలాగే టీడీపీ నుండి టిక్కెట్ రావ‌డంతో టీడీపీలో ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చా టీడీపీ త‌ట్ట బుట్టా స‌ర్ధుకోవాల్సిందే అని విశ్లేష‌కులు, సర్వేలు చెబుతున్నాయి. దీంతో వారు టీడీపీ నుండి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా ప్ర‌చారం అవుతోంది.