పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్

పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్

వరుసగా చతికిలపడ్డ ఆరు సినిమాలు
లక్ కోసం పేరు మార్చుకున్న ధరమ్ తేజ్
సాయి తేజ్ గా స్క్రీన్ నేమ్ మార్పు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. వరుసగా 6 సినిమాలు చతికిల పడటంతో… నెక్స్ట్ మూవీ తప్పకుండా హిట్ కావాలనే పట్టుదలతో సాయి ధరమ్ ఉన్నాడు. తన తాజా చిత్రం ‘చిత్రలహరి’ కోసం లుక్ దగ్గర నుంచి సినిమా కథాంశం వరకు అన్నీ మార్చుకున్నాడు. తన పేరును సైతం మార్చేశాడు. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో అతని స్క్రీన్ నేమ్ సాయి ధరమ్ తేజ్ పడేది. ‘చిత్రలహరి’లో మాత్రం కేవలం సాయి తేజ్ అని పడుతోంది. లక్ కోసమే ఆయన తన పేరును ట్రిమ్ చేశారనే టాక్ వినపడుతోంది. ఈ కొత్త పేరు సాయి తేజ్ కు ఎలా కలిసొస్తుందో వేచి చూడాలి.