పేపర్ లీక్…అంటూ ఆంధ్రజ్యోతి కథనం లో నిజమెంత..?

పేపర్ లీక్ అవ్వడం అంత సులువేనా.. అందులోనూ టైపిస్ట్ కె జాబ్ వచ్చింది ఆ పేపర్ టైప్ చేసింది కూడా ఆమెనే నా!? అసలు APPSC లో పని చేసే టైపిస్టు పేపర్ టైప్ చేయడం ఏంటీ!? ఇక్కడ తెలియట్లే వాడి యదవతనం..

పేపర్ సెట్టింగ్ రాండమ్ గా జరుగుతుంది.. ఒక్కో ఫీల్డ్ ఎక్స్పర్ట్ కొన్ని QUESTIONS ని ఇస్తాడు.. అందులో కొన్ని ప్రశ్నలని రాండమ్ గా పిక్ చేస్తారు. అసలు ఏ ప్రశ్న పిక్ చేశారో సెట్ చేసిన వారికి తెలీదు ముందు..

అలా మొత్తం ఆరు ఏడూ సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయ్. తక్కువలో తక్కువ 7 మంది ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు. ఎవరు ఎం ప్రిపేర్ చేసి ఇచ్చారో ఇంకో వ్యక్తికి తెలీదు..

ఇక టైపింగ్ విషయానికి వస్తే బోర్డ్ లో క్వశ్చన్ పెపర్ టైప్ చేయరు… స్టేట్ లో చాలా ప్రింటింగ్ ప్రెస్ లలో సీక్రెట్ గా ప్రింటింగ్ చేయిస్తారు.. 22 లక్షల పేపర్ లు ప్రింట్ అంటే బోర్డ్ లో ఉన్న XEROX మిషన్ లో ప్రింట్ చేయలేరు చేయరు… బోర్డ్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి పేపర్ సీల్డ్ కవర్ లో వస్తుంది అది కూడా స్టేట్ లో సెపరేట్ సెపరేట్ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఏ ఇన్స్టిట్యూషన్ కి EXAM బాధ్యత ఇచ్చారో వారి నుండి… ఇక్కడ ఏ దశ లో పేపర్ పూర్తిగా ఒక వ్యక్తి కి తెలిసే అవకాశమే ఉండదు… పేపర్ సెట్ చేసిన వాళ్ళతో సహా…

బోర్డ్ లోని ఒక టైపిస్టు క్వశ్చన్ పేపర్ టైప్ చేయడం ఏంటీ !? అది బుర్ర ఉన్న కాస్త అవగాహన ఉన్నోడికి ఎవడికైనా అర్థం అవుతుంది.. అక్కడ ఉండే టైపిస్టు కేవలం ఆఫీస్ వర్క్ కోసం నోటిఫికేషన్స్, టైప్ చేయడం కోసం తప్ప పేపర్ టైప్ చేయడం కోసం కాదు.