పేరు మారిన “తేజ్” యాప్.. ఇకనుంచి “గూగుల్ పే”

మనీ మేడ్ సింపుల్ ట్యాగ్ లైన్ తో గూగుల్ రూపొదించిన “తేజ్” యాప్ పేరు మారింది. యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ “తేజ్” పేరు… ఆ సంస్థ “గూగుల్ పే” గా మార్చింది. పేరు మార్చుతూనే యాప్ లో కొత్త సర్వీసులు అందుబాటులో ఉంచింది. తేజ్ యాప్ ను అప్ డేట్ చేస్తే కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. గూగుల్ పే యాప్ తో.. రీటెయిల్ స్టోర్స్‌కు పేమెంట్స్ చేయొచ్చు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.తేజ్… ఇండియాలో గూగుల్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి పేమెంట్ యాప్. ఇది లాస్టియర్ సెప్టెంబర్ లో ప్రారంభమైంది. ఏడాది కావడంతో… పేమెంట్ యాప్ లుక్కు మార్చేసింది గూగుల్. ఏడాది కాలంలో.. రూ.2లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని చెప్పింది. మొత్తం 75 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయన్న గూగుల్… ప్రతి నెల ఈ యాప్‌ను 2 కోట్ల 20లక్షల మంది వాడుతున్నారని తెలిపింది.

తేజ్ లో ఏ ఫీచర్లనైతే యూజర్స్ ఇష్టపడ్డారో.. అవన్నీ గూగుల్ పేలోనూ ఉంటాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం తేజ్ ఉపయోగించి… గోఐబిబో, ఫ్రెష్‌మెను, రెడ్‌బస్‌లాంటి యాప్స్ లో పేమెంట్ చేయొచ్చు. కొత్త గూగుల్ పే యాప్ తో… బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లతో టై అప్ అయిన గూగుల్ పే… కస్టమర్స్ కు లోన్లు ఇవ్వబోతోంది.