పులసలు వూ రిస్తున్నాయి – ధరేమో దడ పుట్టిస్తున్నాయి

Share This
    • కిలో చేప రూ.6వేలు 
    • వచ్చే నెలలో ధర రూ.8వేలకు చేరుతుందంటున్న మత్స్యకారులు

‘పుస్తెలు అమ్ముకుని అయినా సరే పులస…తింటామా అనే రోజులొచ్చాయి అనేది గోదావరి జిల్లాల్లో నానుడి.. సంవత్సరానికి కేవలం రెండు నెలలు(జులై, ఆగస్టు) మాత్రమే లభించే అరుదైన పులస చేపంటే గోదావరి జిల్లా ప్రజలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు పడి చచ్చిపోతుంటారు,పులస చేపలులొట్టలేసుకుంటూ ఆరగించేస్తుంటారు. తాజాాగా అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటు పెరిగింది. దీంతో పులస చేపలు హాయ్ అంటూ గోదారోళ్లను పలకరిస్తున్నాయి. యానాం తీరంలో రెండు మూడు రోజులుగా పులస చేపలు వలలో పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply