పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ పాలకమండలి

 

  • తిరుమల నీటి సమస్య పరిష్కారానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం
  • బాలాజీ రిజర్వాయర్ కు అవిలాల ట్యాంక్ నిధుల తరలింపు
  • అమరావతి శ్రీవారి ఆలయానికి రూ. 36 కోట్లు

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నేడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు.

వాటి వివరాలు:

  • తిరుమలలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం.
  • అవిలాల ట్యాంక్ అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి తరలింపు.
  • టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సబ్ కమిటీ నియామకం.
  • అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన రూ. 150 కోట్లను రూ. 36 కోట్లకు కుదింపు.
  • గరుడ వారధికి ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరం నిధుల కేటాయింపు.