నోరుజారిన బాలయ్య… వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!

  • ‘హరికృష్ణ మృతితో సంభ్రమాశ్చర్యం’
  • సుహాసిని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య
  • మీడియాతో మాట్లాడుతూ పొరపాటు వ్యాఖ్యలు
  • మరణిస్తే, సంభ్రమాశ్చర్యం ఏమిటని ట్రోలింగ్

ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా, తనదైన వాక్చాతుర్యంతో, సందర్భానుసారం సంస్కృత శ్లోకాలు చెబుతూ అలరించే నందమూరి బాలకృష్ణ నోరుజారగా, ఇప్పుడాయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిన్న కూకట్ పల్లి నుంచి మహాకూటమి తరఫున అభ్యర్థినిగా సుహాసిని నామినేషన్ దాఖలు చేయగా, ఆ సందర్భంగా బాలయ్య, మాట్లాడుతూ, దివంగత హరికృష్ణను గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లో హరికృష్ణ మృతితో అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయని అనడం, ఇప్పుడు ఇతర పార్టీలకు విమర్శించేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చింది. ఆయన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణిస్తే సంభ్రమాశ్చర్యం ఏంటని ట్రోల్ చేస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.