నేను బీజేపీ కార్యకర్తను.. ప్రధాని రేసులో లేను: నితిన్ గడ్కరీ

తాను ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే  మిమ్మల్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందటగా?’ అన్న మీడియా ప్రశ్నకు గడ్కరీ బదులిస్తూ.. అటువంటిదేం లేదని కొట్టిపడేశారు. అవన్నీ పసలేని విశ్లేషణలని పేర్కొన్నారు.

బీజేపీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలుగా తామంతా వెనకే ఉన్నామని, అటువంటప్పుడు ప్రధాని అవుతానన్న ప్రశ్నకు తావు లేదన్నారు. తాను బీజేపీ కోసం పనిచేసే ఓ కార్యకర్తను మాత్రమేనని, అవకాశవాద నేతను కాదని గడ్కరీ స్పష్టం చేశారు.