నేను అనుకున్నట్టుగానే జరిగింది: పూజా హెగ్డే

జిగేల్ రాణి పాట విన్నాను
హిట్ అవుతుందని అనిపించింది
అందుకే అంగీకరించాను
ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తోన్న కథానాయికగా పూజా హెగ్డే కనిపిస్తోంది. పూజా ఇంతగా బిజీ కావడానికి కారణం, ‘దువ్వాడ జగన్నాథం’ అనే చెప్పాలి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, పూజా నాజూకుదనానికి అంతా ఫిదా అయ్యారు. ఆ తరువాత ఈ సుందరి ‘రంగస్థలం’లో చేసిన ‘జిగేలు రాణి’ఐటెమ్ సాంగ్ అమాంతంగా క్రేజ్ ను పెంచేసింది.

ఈ సాంగ్ గురించి తాజాగా పూజా మాట్లాడుతూ, నన్ను ‘జిగేలు రాణి’ చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో వున్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. అందువల్లనే రెండో ఆలోచన లేకుండా ఈ పాట చేయడానికి అంగీకరించాను. ఈ పాట విషయంలో నేను ఏదైతే అనుకున్నానో .. అదే జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది.