నేడు సాయంత్రం పంచాయతీ కార్యదర్శి పరీక్ష ‘కీ’ వెల్లడి!

Share This
ఏపీలో గ్రూపు-3 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రాథమిక ‘కీ’ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం (ఏప్రిల్ 23) సాయంత్రం వెల్లడించనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 1,320 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం (ఏప్రిల్ 21) నిర్వహించిన ఈ ప‌రీక్షకు మొత్తం 4,95,526 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా 3,89,014 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. మొత్తం 2,94,966 మంది (75.82%) మంది అభ్యర్థులు ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. ఉదయం 10.00 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.