నేడు రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలు

 

హైదరాబాద్‌: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఇతర ప్రముఖులు, ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శనివారం ఉదయం రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరుగుతాయి. ప్రగతిభవన్‌లో వేడుకలు జరపరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఈ ఏడాది రవీంద్రభారతిలో జరపనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.