నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ డుమ్మా!

నేడు మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో కేసీఆర్ బిజీ
ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న కేసీఆర్
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటున్న సీఎం నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, ఈ నెల 16న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో అనుమతి కోరారు. ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి వస్తే ఆయన ఢిల్లీ వెళ్తారు.