నిర్భయ తరపున వాదించనున్న కోడలు.. ధర్మాసనం నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్

నిర్భయ తరపున వాదించనున్న కోడలు.. ధర్మాసనం నుంచి తప్పుకున్న చీఫ్ జస్టిస్

  • సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన దోషి అక్షయ్ సింగ్
  • కోడలు వాదిస్తున్న కేసులో తీర్పును వెలువరించలేనన్న చీఫ్ జస్టిస్ బాబ్డే
  • రేపు విచారణ చేపట్టనున్న మరో ధర్మాసనం

నిర్భయ హత్యాచారం కేసులో దోషి అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. పిటిషన్ ను విచారించనున్న ధర్మాసనం నుంచి చీఫ్ జస్టిస్ బాబ్డే తప్పుకోవడమే దీనికి కారణం. ఈ పిటిషన్ కు సంబంధించి నిర్భయ తరపున బాబ్డే కోడలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోడలు వాదిస్తున్న కేసులో తాను తీర్పును వెలువరించలేదని ఆయన తెలిపారు. ధర్మాసనం నుంచి తాను తప్పుకుంటున్నానని చెప్పారు. రేపు ఉదయం 10.30 గంటలకు మరో ధర్మాసనం విచారణ చేపడుతుందని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి బాబ్డే కుటుంబంలోని ఒకరు నిర్భయ తల్లి తరపున వాదనలు వినిపించారు.