నిజామాబాద్‌లో పసుపు బోర్డు

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు పంట ఎగుమతులపై బోర్డు ప్రత్యేక దృష్టి సారించనుంది. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కూడా ఈ బోర్డ్‌ పని చేయనుంది.