నామినేషన్ వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల వారిగా పలువురు టీఆర్ఎస్ అభ్యర్లులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప్పల్ టీఆర్ఎస్ అభ్యర్థి బేతి సుబాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మేయర్ బొంతు రాంమోహన్, కార్పొరేటర్లున్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్య రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రాజయ్య వెంట డిప్యూటి సిఎం కడియం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.

షాద్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యానాయక్ నామినేషన్ దాఖలు చేశారు. రెడ్యానాయక్ వెంట మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. పరకాల చల్లా ధర్మారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఖానాపూర్ ఉట్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి రేఖానాయక్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వరంగల్ రూరల్ వర్ధన్నపేట ఆర్వో ఆఫీసులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. నర్సంపేట ఆర్డీవో కార్యాలయం(ఆర్వో)లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆభ్యర్ది పెద్ది సుదర్శన్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా ములుగు నియోజకవర్గం టీఆరెస్ అభ్యర్థిగా మంత్రి చందూలాల్ నామినేషన్ దాఖలు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు జి వివేక్, ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు
ఉన్నారు. వేములవాడ టిఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ బాబు నామినేషన్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.