దేవెగౌడ గారూ… మీకోసం ప్రార్థిస్తున్నా: నరేంద్ర మోదీ

పుట్టిన రోజును జరుపుకుంటున్న దేవెగౌడ
ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఎన్నికల ప్రచార సమయంలోనూ పొగడ్తలు
మాజీ ప్రధాని, కర్ణాటకలో జేడీఎస్ (జనతాదళ్ సెక్యులర్) గౌరవాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, దేవెగౌడ ఆరోగ్యం, ఆయుష్షు కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

“నేను మాజీ ప్రధాని దేవెగౌడతో మాట్లాడాను. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షును కలిగుండాలని ప్రార్థిస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సమయంలోనూ నరేంద్ర మోదీ, దేవెగౌడను ప్రస్తావిస్తూ, ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.