‘దేవదాస్’ శాటిలైట్ రైట్స్ 15 కోట్లు?

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’
కథానాయకులుగా నాగ్ .. నాని
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ చిత్రం రూపొందింది. నాగార్జున .. నాని కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ మల్టీ స్టారర్ మూవీకి అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో డాన్ గా నాగార్జున నటించగా, ఆయన సరసన ఆకాంక్ష సింగ్ కనిపించనుంది. ఇక డాక్టర్ గా నాని కనిపించనుండగా ఆయన జోడీగా రష్మిక మందన నటించింది.

ఇది మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ నాగార్జున .. నాని ఇద్దరూ కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ తో తమకి గల అనుబంధం కారణంగానే ఈ ఇద్దరూ కూడా తక్కువ రెమ్యునరేషన్ అందుకున్నారని అంటున్నారు. ఇక ఇటు నాగార్జునకి .. అటు నానికి ఇద్దరికీ కూడా ఎవరి క్రేజ్ వాళ్లకి ఉండనే వుంది. ఈ కారణంగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు 15 కోట్లు చెబుతున్నారట. ఈ రేటుకు శాటిలైట్ హక్కులు అమ్ముడైతే ఈ ప్రాజెక్టు లాభాల్లో పడినట్టేనని చెప్పుకుంటున్నారు.