దినకరన్ కు పట్టిన గతే రజనీకాంత్ కు పడుతుంది: జయకుమార్

Share This

మార్చిలో రజనీ కొత్త పార్టీని స్థాపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి
ప్రజల ఆదరణ పొందడం అంత ఈజీ కాదు
స్టాలిన్ హద్దులు మీరి విమర్శలు చేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ పై తమిళనాడు మంత్రి జయకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీని ప్రారంభించిన దినకరన్ కు పట్టిన గతే రజనీకాంత్ కు పడుతుందని చెప్పారు. రజనీకాంత్ మార్చిలో పార్టీని ప్రారంభిస్తున్నారనే వార్తలు వస్తున్నాయని… రాజకీయ పార్టీని ఎవరైనా ప్రారంభించవచ్చని… కానీ, ప్రజల ఆదరణను సంపాదించడం అంత ఈజీ కాదని అన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి విదేశీ పర్యటనపై డీఎంకే అధినేత స్టాలిన్ హద్దు మీరి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. 2021 ఎన్నికల్లో 200 స్థానాలను కైవసం చేసుకుంటామని స్టాలిన్ చెబుతున్నారని… 20 నియోజకవర్గాల్లో గెలవడం కూడా ఆ పార్టీకి కష్టమేనని ఎద్దేవా చేశారు.

2021 ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో అన్నాడీఎంకే ఘన విజయం సాధిస్తుందని జయకుమార్ జోస్యం చెప్పారు. దినకరన్ పార్టీకి కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే పడతాయని.. రజనీకాంత్ కొత్త పార్టీని స్థాపిస్తే, ఆయన పార్టీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు.
Tags: Dinakaran, Rajinikanth, Jayakumar, Palaniswamy, Stalin, DMK AIADMK