త్రిష చిరకాల కోరిక నెరవేరింది

బ్యాంకాక్ లో ‘దేవదాస్’ రొమాన్స్
పెళ్లి తర్వాత చైతూ, సమంతల ‘మజిలీ’
* సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి నటించాలన్న త్రిష చిరకాల కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో త్రిష కథానాయికగా ఫైనల్ అయింది. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
* నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాస్’ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా బ్యాంకాక్ లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగులో హీరోయిన్ రష్మిక మందన కూడా జాయిన్ అయింది. శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక నటిస్తున్నారు.
* వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత కలసి ఇప్పుడు ఓ చిత్రంలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ‘మజిలీ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Tags:Trisha,super star ,rajni kanth,nag chaitanya,samantha,#magili, #nag nani devadas