తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ సి.వి రాములు, ఉపలోకాయుక్తగా జి. నిరంజన్ రావు

 

 

రాష్ట్ర హక్కుల కమిషన్ చైర్మన్ బి. చంద్రయ్య, సభ్యులు : ఎన్. ఆనందరావు, మొహమ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్

 

హైదరాబాద్ : తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను గురువారం ఉదయం ప్రగతిభవన్ లో సమావేశమై నిర్ణయించింది. లోకాయుక్తగా జస్టిస్ సివి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్ రావును సిఫారసు చేసింది. కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలి లో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జా ఫ్రీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తిమిళిసై ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా బి. చంద్రయ్య, సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ లను నియమించింది. ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అందుబాటు లో లేకపోవడం వలన ఈ సమావేశానికి ఆ పార్టీ ఉప నేత పాషాఖాద్రీ హాజరయ్యారు.