తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ పండుగ అని  పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. సహజసిద్ధమైన పూలను ఆరాధించే బతుకమ్మ పండువగా.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుందన్నారు. బతుకమ్మ పండుగ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.