తెలంగాణలో త్వరలో ఇంటర్ ఫలితాలు

  • ఏప్రిల్ 8న ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
  • అధికారిక వెబ్‌సైట్‌లలో ఫలితాలు అందుబాటులో
  • మే 30 వరకు వేసవి సెలవులు.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం
తెలంగాణలో త్వరలోనే ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 13న విడుదలచేసిన సంగతి తెలిసిందే.
results.cgg.gov.in
bie.telangana.gov.in
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1300 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9, 42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెలవులు ముగిసిన తర్వాత జూన్‌ 1 నుంచి 2019-20 విద్యాసంవత్సరానికి తరగతులను ప్రారంభంకానున్నాయి.