తెలంగాణలో ఆంధ్రా వాసుల సర్వే... 9 మంది బైండోవర్!

తెలంగాణలో ఆంధ్రా వాసుల సర్వే… 9 మంది బైండోవర్!

  • సర్వే పేరిట పాలేరులో సంచారం
  • అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, తమకు అనుమానం వచ్చిన వారెవరినీ తనిఖీలు చేస్తున్న పోలీసులు వదలడం లేదు. తాజాగా, ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఏపీలోని విజయనగరం, విజయవాడ ప్రాంతాలకు చెందిన 9 మందిని బైండోవర్ చేశారు.

ఎన్నికల సర్వే పేరుతో వీరు తెలంగాణలో తిరుగుతుంటే, అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వీరిని బైండోవర్ చేసి, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రవేశపెట్టామని కూసుమంచి ఎస్ఐ అశోక్ మీడియాకు తెలిపారు. ఆపై వీరిని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశామని అన్నారు. వీరంతా పాలేరు ప్రాంతంలో సర్వే చేసేందుకు వచ్చినట్టు తెలిపారని ఆయన అన్నారు.