తండ్రి లేడని, ఇక రాడని ఈ చిన్నారికి చెప్పేదెవరు?

కుప్వారాలో ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్
ప్రాణాలర్పించిన ముకుత్ బిహారీ మీనా
అంత్యక్రియల వేళ అమాయకంగా ఉన్న అతని బిడ్డ
ముకుత్ బిహారీ మీనా… 25 ఏళ్ల రాజస్థాన్ యువకుడు. దేశం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఈనెల 11వ తేదీన కుప్వారాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలాడు. అతని మృతదేహం స్వగ్రామానికి చేరిన వేళ, అక్కడికి వెళ్లిన జలావర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర సోనీ, భావోద్వేగానికి లోనై, ఓ చిత్రాన్ని పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. తండ్రి శవపేటికపై ఐదు నెలలు నిండని పసికందు అమాయకంగా చూస్తూ కూర్చుని ఉండగా, తండ్రి లేడని, ఇక రాడని ఈ చిన్నారికి చెప్పేదెవరన్నట్టుంది. “శవపేటికపై ఏడవకుండా కూర్చుని ఉన్నావు. గతంలో నీ తండ్రిని చూస్తున్నప్పుడు కనిపించిన అమాయకత్వమే నీలోనూ కనిపిస్తూ, మమ్మల్ని ఎంతో కదిలిస్తోంది. దేశంలోని ప్రతి బాధ్యతగల పౌరుడూ నీవెంటే ఉంటాడు. నువ్వు పెరిగి పెద్దయిన తరువాత నీ తండ్రి త్యాగాన్ని చూసి గర్వపడతావు” అని జితేంద్ర ట్వీట్ చేశారు.