ఢిల్లీలో పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాదిపాటు నిషేధం

Share This
  • ఈ మేరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసిన ఢిల్లీ ప్రభుత్వం
  • ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకాలు జరపరాదు
  • సిగరెట్ల అమ్మకాలపై మాత్రం యథాతథ పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం అమల్లో ఉన్న పొగాకు ఉత్పత్తులపై నిషేధాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతా వ్యవహారాల కమిషషనర్‌ ఎల్‌.ఆర్‌.గార్గ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల  పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్‌మసాలా, సెంటెడ్‌ లేదా ఫ్లేవర్డ్‌ టొబాకో, ఖర్రాతో సహా ఎలాంటి పదార్థాల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని జారీ చేసిన ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అయితే అత్యధికంగా అమ్ముడయ్యే సిగరెట్లపై మాత్రం ఎటువంటి నిషేధం విధించక పోవడం గమనార్హం.