టీ-కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు..

  • నేతల మధ్య చిచ్చుపెట్టిన హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం
  • పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును ప్రకటించిన ఉత్తమ్
  • దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

టీ-కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం నేతల మధ్య చిచ్చుపెట్టింది. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైకమాండ్ కు చెప్పకుండా ఆమె పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను ఆయన కలిశారు. ఉత్తమ్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. రేవంత్ అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కుంతియా చెప్పినట్టు తెలుస్తోంది.