Thota-Seetharama-Lakshmi

టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మి

నలుగురు టీడీపీకి చెందిన రాజ్య సభ సభ్యులు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ , సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు గురువారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వారు అందచేశారుఅయితే టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ రాజ్య సభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి టీడీపీ ఎంపీలు కలిసి ఓ లేఖ సమర్పించారు.

అనంతరం, మీడియాతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం రాజ్యాంగ విరుద్ధమని, నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని తమ లేఖలో కోరామని చెప్పారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశం ఉందని అన్నారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని, ఈ విషయాన్ని వెంకయ్యనాయుడికి చెప్పామని అన్నారు.