టీడీపీని నందమూరి ఫ్యామిలీ టేకోవర్ చేయనుందా..?

Share This

తెలుగుదేశం పార్టీ పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే చందంగా మారిపోయింది. ఇప్పటికే ఓటమి భారంగా కుంగిపోతున్న చంద్రబాబు నాయుడుకి, ఇప్పుడు పార్టీని కాపాడుకోవటం కూడా చాలా కష్టముగా మారిపోతుంది. తిరుగుబాటు ఎగరవేయటానికి అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో పార్టీని ఇక నుండి మెల్ల మెల్లగా నందమూరి ఫ్యామిలీ టేకోవర్ చేయబోతుందనే మాటలు కూడా గట్టిగానే వినవస్తున్నాయి.

వాటికీ బలం చేకూరుస్తూ నిన్నటికి నిన్న ఒక సంఘటన జరిగింది. నందమూరి జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ ఒక వీడియో విడుదల చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, వాటిని చూస్తూ సహించేది లేదు. పార్టీకి కార్యకర్తలే అసలైన బలం , వాళ్ళని ఇబ్బంది పెడితే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఒక వీడియో విడుదల చేశాడు. అసలు చైతన్య కృష్ణ ఇప్పుడు ఉన్నఫళంగా వీడియో విడుదల చేయవల్సిన పనేమిటనే దానిమీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

చైతన్య కృష్ణ రాజకీయాలకి దూరంగా ఉన్నకాని, ఎన్నికల సమయంలో పార్టీకోసం పని చేసే వ్యక్తి, తమ తాత పెట్టిన పార్టీ మీద తమకి హక్కు ఉందంటూ మాట్లాడే వ్యక్తి చైతన్య కృష్ణ. బహుశా ఆ మాటలు వలన కూడా కావచ్చు ఆయనకి టీడీపీలో పెద్దగా ఆదరణ దక్కలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కార్యకర్తల కోసం మాట్లాడుతూ మీకు మేము సపోర్ట్ గా ఉన్నామని చెప్పటం చూస్తుంటే రాబోవు రోజులో టీడీపీ పార్టీని నందమూరి వారసులు నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ కూడా కార్యకర్తల దాడుల మీద మాట్లాడితే క్యాడర్ లో దైర్యం నింపినట్లు అవుతుందని కొందరు అంటున్నారు.

Leave a Reply