టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు.. ప్రత్యేక పూజలు!

  • హిమాలయాల నుంచి నేరుగా విజయవాడకు
  • సుబ్బారెడ్డి ఇంట్లో ప్రత్యేకపూజలు నిర్వహించిన అఘోరాలు
  • సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఈరోజు అఘోరాలు విచ్చేశారు. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి