టీఆర్ఎస్ లోకి జానారెడ్డి వస్తే.. టిక్కెట్ త్యాగం చేస్తా: నోముల

 

  • కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు
  • నల్గొండ ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలూ టీఆర్ఎస్ వే
  • నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయం

టీఆర్ఎస్ లోకి జానారెడ్డి వస్తే టిక్కెట్ త్యాగం చేస్తానని నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటలూ విద్యుత్ అందిస్తున్నారని, ఈ విషయమై నాడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలను నోముల ప్రస్తావించారు.

నాడు జానారెడ్డి చెప్పిన ప్రకారం టీఆర్ఎస్ కు ఆయన ప్రచారం చేయాలని, బత్తాయి రైతులు ఆనందంగా ఉన్నారా? లేరా? అన్న విషయం జానారెడ్డే చెప్పాలని అన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.