nri, rajni kumari,tdp, prathipati pulla rao,ys jagan

జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఈమె ఎవ‌రో తెలుసా..?

రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ ఎన్నారై మ‌హిళ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉన్న‌ట్టుండి ఆమె తెలుగుదేశం పార్టీని వీడి ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో ఇప్పుడామె గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె ఈనెల 24న వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో, ఒక్క‌సారిగా ఆమె ఎవ‌రు అన్న ప్ర‌శ్న చాలామందికి క‌లుగుతోంది. రాజ‌కీయ ఉద్ధండుల‌కు పుట్టినిల్లు గుంటూరు జిల్లా. ఈ జిల్లా నుంచి ఎన్నికైన వారు ముఖ్య‌మంత్రులు కూడా అయ్యారు. ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీకి స్పీక‌ర్ గా వ్య‌వహ‌రిస్తున్న కోడెల శివ‌ప్ర‌సాద రావు కూడా గుంటూరు జిల్లానే తెలుసు క‌దా.. అయితే, ఈ జిల్లా నుంచి రాజ‌కీయం చేసేందుకు ఓ కొత్త మ‌హిళ వ‌చ్చి చేరింది. ఆమె పేరు విడ‌ద‌ల ర‌జ‌నీకుమారి. వీఆర్ ఫౌండేష‌న్ ద్వారా అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ, ప్ర‌జ‌ల మంచి చెడ్డా తెలుసుకుంటూ రాజ‌కీయంగా ఎద‌గాల‌ని భావిస్తోంది.

అయితే, మొద‌ట‌గా ట్ర‌స్టు పేరుతో ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత చిలుక‌లూరి పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నుకున్న ర‌జ‌నీకుమారి, ఆ మ‌ధ్య మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరింది. త‌న‌కు చంద్ర‌బాబు అంటే చాలా ఇష్ట‌మని, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ గెల‌వాల‌ని కోరుకుంటున్నాన‌ని, మ‌ళ్లీ సీఎంగా చంద్ర‌బాబే కావాల‌ని భావిస్తున్నాన‌ని ఆమె గ‌తంలో బ‌హిరంగ స‌భ‌ల‌పై కూడా ప్ర‌సంగించి చంద్ర‌బాబు దృష్టిలోనూ ప‌డింది. ఇంతలోనే ఆమెకు ఎవ‌రు ఏం నూరిపోశారో తెలియ‌దు కానీ, ఒక్కసారిగా మంత్రి ప‌త్తిపాటి పుల్లారావుకే ఎస‌రు పెట్టేందుకు రెడీ అయింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిలుక‌లూరి పేట టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోర‌డం మొద‌లు పెట్టింది. నిన్న‌గాక మొన్న పార్టీలో చేరి అప్పుడే టికెట్ కావాల‌ని ఒత్తిడి తేవ‌డం ఏంట‌ని అధిష్టానం నుంచి ప్ర‌శ్నించ‌డంతో వెన‌క్కి త‌గ్గిన ర‌జ‌నీకుమారి, మెల్ల‌మెల్ల‌గా టీడీపీకి దూరం జ‌రిగి వైసీపీతో రాయ‌బారం మొద‌లు పెట్టింది. చిలుక‌లూరి పేట టికెట్ ఇస్తే వైసీపీలో చేర‌తాన‌ని సంప్ర‌దింపులు గ‌ట్టిగానే జ‌రిపింది. కానీ, అక్క‌డి నుంచి కూడా మొద‌ట ఎలాంటి స్పంద‌న రాలేదు. చిలుకలూరి పేట నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఉన్నందున ర‌జినీ కుమారికి ఇవ్వ‌లేమ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పేశాడ‌ట‌.

అయిన‌ప్ప‌టికీ ఆమె తాజాగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కొంత అనారోగ్యంతో స‌త‌మ‌తం అవుతున్నార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసే అవ‌కాశాలు లేవ‌ని, ఆయ‌న భార్య‌కు టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నార‌ని, అయితే ఆయ‌న భార్య‌కు టికెట్ ఇస్తే గెల‌వ‌డం క‌ష్టమ‌ని భావిస్తున్న జ‌గ‌న్, తాజాగా ర‌జినీ కుమారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని, అందుకే ఆమె స‌డెన్ గా పార్టీలో చేరిపోయార‌ని గుంటూరు జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతుంది. ర‌జినీకుమారి చేరిక‌తో చిలుక‌లూరి పేట రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు స‌మ‌క్షంలో టీడీపీలో చేరిన ర‌జినీకుమారి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అత‌నిపైనే పోటీ చేసేందుకు స‌న్న‌ద్దం కావ‌డం ఆస‌క్తికరంగా మారింది. చూడాలి మ‌రి… ర‌జినీ కుమారి ఏ మేర‌కు రాణిస్తుంద.

Tags: nri, rajni kumari,tdp, prathipati pulla rao,ys jagan