jagan attack

జ‌గ‌న్ ను పొడిచిన క‌త్తి గంట పాటు మిస్‌.. ఎక్క‌డికి వెళ్లింది?

విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌గ‌న్ పై కోడి క‌త్తితో దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. జ‌గ‌న్ పై దాడి చేసిన అనంత‌రం.. దాడికి ఉప‌యోగించిన క‌త్తి గంట పాటు క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు.

సెల్ఫీ దిగేందుకు జ‌గ‌న్ వ‌ద్ద‌కు న‌వ్వుతూ వ‌చ్చిన శ్రీ‌నివాస్‌.. త‌న జేబులో దాచిన క‌త్తితో దాడి చేయ‌టం తెలిసిందే. అయితే.. అప్ప‌టికే అప్ర‌మ‌త్తంగా ఉన్న జ‌గ‌న్ ప‌క్క‌కు త‌ప్పుకోవ‌టంతో భుజానికి గాయమైంది. దాడి విష‌యాన్ని చూసినంత‌నే చుట్టూ ఉన్న వారు రియాక్ట్ కావ‌టం.. వెంట‌నే శ్రీ‌నివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా సిబ్బందికి శ్రీ‌నివాస్ ను అప్ప‌గించారే కానీ.. జ‌గ‌న్ పై దాడికి ఉప‌యోగించిన క‌త్తిని ఇవ్వ‌లేద‌న్న‌ది తాజా స‌మాచారం. దాదాపు గంట పాటు..దాడికి ఉప‌యోగించిన క‌త్తిని భ‌ద్ర‌తా సిబ్బందికి ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఈ గంట పాటు క‌త్తి ఎక్క‌డికి వెళ్లింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం క‌త్తితో దాడి జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డే ఉన్న పార్టీ నేత‌లు మ‌ళ్ల విజ‌య్ ప్ర‌సాద్‌.. బొత్స మేన‌ల్లుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావులు క‌లిసి ఆ కత్తిని తీసుకొన్నార‌ని.. వెంట‌నే దాన్ని న‌గ‌రంలోని ఒక డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ కు పంపి ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప‌రీక్ష‌ల అనంత‌రం ఎయిర్ పోర్ట్‌కు తీసుకొని పోలీసుల‌కు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ ఇచ్చిన ప్రాధ‌మిక స‌మాచారంతో ఎలాంటి ప్ర‌మాదం లేద‌న్న విష‌యాన్ని గుర్తించి.. హైద‌రాబాద్‌కు విమానంలో వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. గంట పాటు క‌త్తి పోలీసుల చేతికి రాలేద‌న్న స‌మాచారం బ‌య‌ట‌కు రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం.