cbn hand behind jd lakshmi narayana new party

జేడీ కొత్త పార్టీ వెనుక చంద్రబాబు హస్తం..జనసేన టార్గెట్.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతున్నాయి.ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా సరే ప్రస్తుతం మాత్రం మూడు ప్రధాన పార్టీల మధ్యనే రసవత్తర పోరు ఉండబోతుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా..సిబిఐ సంచలనం జేడీ లక్ష్మీనారాయణ పేరు మన ఆంధ్ర రాష్ట్రంలో సుపరిచితమే,ఆయన కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి గత కొద్ది నెలల నుంచి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ విరివిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.అయితే తన రాజకీయ ప్రవేశం కోసం ఎప్పటి నుంచో సస్పెన్స్ గానే ఉంచినా ఇటీవలే తాను కూడా ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త పార్టీ పెట్టబోతున్నాను అని సంచలనానికి తెర లేపారు.

అయితే జేడీ లక్ష్మి నారాయణ గారికి ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నా సరే ఇతర పార్టీలతో పోలిస్తే అంత ప్రజా బలం లేదనే చెప్పాలి.ఆయన అంటే అభిమానం ఉన్నవాళ్లు తప్ప ఆయన అనుచరులు నుంచి మాత్రం అతనికి మద్దతు బాగానే ఉంటుంది.అయితే ఇటీవలే చంద్రబాబు సిబిఐ వారు ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదని ఆంక్షలు పెట్టడం,ఈయన ఎప్పుడో తన ఉద్యోగానికి రాజీనామా చెయ్యడం,ఈ అన్నింటిని కలుపుతూ ఎక్కడో చంద్రబాబు యొక్క హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుందని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.అంతే కాకుండా జనసేన శ్రేణులు నుంచి అయితే మరో రకపు వాదనలు కూడా వస్తున్నాయి.జేడీ కొత్త పార్టీ పెట్టడం వెనుక చంద్రబాబు కుట్ర ఉండే ఉంటుందని,పరోక్షంగా జనసేన పార్టీ ని దెబ్బ కొట్టేందుకు మరియు ఓట్లను చీల్చడానికే చంద్రబాబు కొత్త నాటకానికి తెర లేపారని కొంతమంది జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.