Bjp mp, nara simha rao,rtc chairman,varla ramaiah, GVL

జీవీఎల్ ఒక అహంకారి

బీజేపీ ఎంపీ నరసింహ రావు అహంకారి. విషయ పరిజ్ఞానం లేకుండా విదూషకుడిలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య ఆరోపించారు. ఐదు రోజులుగా పేతాయి తూఫాన్ విధ్వంసం నుండి కోస్తా తీర ప్రాంతాన్ని అప్రమత్తంగా చేసిని చంద్ర బాబు నాయుడును జాతీయ మీడియా కొనియాడింది. ప్రాణ నష్టం జరుగకుండా చేసి అతి స్వల్ప నష్టము మాత్రమే చేశారు చంద్రబాబు నాయుడు. తిట్లీ తూఫాన్ సమయంలో రాజనాధ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి కూడా శ్రీకాకుళం జిల్లా వైపు కూడా చూడలేదు మాట్లాడలేదని అయన అన్నారు. ప్రధాన మంత్రి వ్యవహారశైలి ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది. నీకు బుద్ధి ఉందా జీవీఎల్ అని ప్రశ్నించారు. రాష్ట్ర అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి పెను ఆపద నుండి రాష్ట్ర ప్రభుత్వం కాపాడారు. భారతీయ జనతా పార్టీ పాలనలో దళితులకు రక్షణ లేదు అని రాజీనామా చేసి వెళ్లిన సావిత్రి బాయి పూలే మీ ఎంపీ కాదా అని అడిగారు. ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అయన అన్నారు. చంద్రబాబు నీరో చక్రవర్తిలా కనిపించారు అనటం అవగాహన రాహిత్యమని అయన విమర్శించారు. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు బిజెపి పాలనలో అభద్రతా భావంతో ఉన్నారని అయన అన్నారు.
Tags: Bjp mp, nara simha rao,rtc chairman,varla ramaiah, GVL