జిల్లాల వారీగా అభివృద్ధి: హైపర్ కమిటీ

Share This

 

హైపర్ కమిటీ సమావేశంలో జిల్లాల వారీగా అభివృద్ధి అంశాలను చర్చించాం

మరోసారి 17 వ తేదీన భేటీ అవుతున్నాం. రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వం కు ఏం చెప్పదలుచుకున్నారో సిఆర్డీఎ కమిషనర్ కు ఈనెల 17వ తేదీ సాయంత్రం లోగా తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చు.లిఖిత పూర్వకంగా, లేదా ఈ మెయిల్ ద్వారా కూడా తమ అభిప్రాయాలు పంపవచ్చు. రాజధానిలోని 29 గ్రామాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.చంద్రబాబు రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకుని లబ్ది పొందడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ ప్రాంతానికి చెందని మహిళలను ముందుకు తీసుకు వచ్చి ఆందోళనలు చేయిస్తున్నాడు.రాజకీయంగా ప్రేరేపితం చేసే ఉద్యమాలతో చంద్రబాబు రైతులను మభ్యపెడుతున్నాడు.పోలీసులను రెచ్చగొట్టేలా ధర్నాలు చేయిస్తున్నాడు.ఈ ప్రేరేపిత ఆందోళనల వెనుక చంద్రబాబు వ్యూహం వుంది.హైపవర్ కమిటీ భేటీలో ప్రతిసారీ రైతుల గురించి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం రాజధాని విషయంలో ఏం చేయదలుచుకుందో ఈ 29 గ్రామాల రైతాంగానికి అర్ధం అవుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులతో రైతులు చర్చలు జరుపుతున్నారు. 29 గ్రామాలకు చెందిన రైతులు
మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. టిడిపి వైపు నుంచి తమపై దాడులు జరుగుతాయని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ కురసాల కన్నబాబు కామెంట్స్

చంద్రబాబు బాధ ప్రపంచం బాధ. చంద్రబాబు ఆనందంగా వుంటేనే అందరూ ఆనందంగా పండుగ . ఇప్పటికే తమ రాజకీయ లబ్ది కోసం అమరావతి ప్రాంతం లోని రైతులను అయోమయంకు గురి చేశాడు. అర్ధంలేని కృత్రిమ‌ ఉద్యమాన్ని సృష్టించాడు.కనీసం పండుగ పూట అయినా రైతులను సంతోషంగా వుండకుండా చేస్తున్నాడు. మాది రైతు ప్రభుత్వం.రైతుల సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం.చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం రాష్ట్రంలో వ్యవస్థ లను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. రాష్ట్ర డీజీపీపై అనుచిత విమర్శలు చేశాడు. డీజీపీపై ప్రాంతీయ విమర్శలు ఎలా చేస్తారు? వ్యవస్థ లను కించపరిచేలా వ్యవహరించ వద్దని చంద్రబాబుకు చెబుతున్నాం. ఇన్నేళ్ళ రాజకీయ అనుభవం వున్న వ్యక్తి ఇలా మాట్లాడతారా?

*రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి శ్రీ
కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) కామెంట్స్*

సీఎం శ్రీ వైఎస్ జగన్ దెబ్బకు టిడిపి అధినేత చంద్రబాబు ముష్టి ఎత్తే స్థితికి దిగజారాడు

అమరావతి ఉద్యమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి జోలెపట్టి ముస్టి అడుక్కుంటున్నాడు. కొత్త బిచ్చగాడిలా మారి సంక్రాంతికి ఇళ్ళముందు అడుక్కునేందుకు వచ్చే పగటి వేషగాడిలా తయారయ్యాడు. గతంలో సీఎంగా వుండి అహంభావంతో తాట తీస్తాను.. అట్టడుగు, బడుగువర్గాలు సెక్రటేరియట్ రావద్దంటూ చంద్రబాబు మాట్లాడారు.ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం రైతులను రెచ్చగొట్టి ఉద్యమం అంటూ తిరుగుతున్నాడు.చంద్రబాబు నైజంను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.

ఈ రోజు జరిగిన హైపర్ కమిటీ
ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి ప్రభుత్వం ఏం చేయాలి అనే దానిపై చర్చించింది

చంద్రబాబు సీఎం అయిన తరువాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో వెనుకబాటుతనం పెరిగిపోయింది

రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రాంతాల మధ్య అసమానతలు మరోసారి బయటపడ్డాయి

ఇటువంటి పరిస్థితి మరోసారి రాకుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఈ సమావేశం లో చర్చించాం

కృష్ణా, గుంటూరు జిల్లాలు అంటే 29 రాజధాని గ్రామాలు కాదు. ఈ రెండు జిల్లాల్లో
3 వేల గ్రామాలు వున్నాయి. సీఅర్డీఎ పరిధిలోకి మచిలీపట్నం పార్లమెంట్ ను తీసుకువచ్చారు. దీనివల్ల ఏడు నియోజకవర్గాల్లో  అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమావేశంలో లో సీఆర్‌డీఏ నుంచి ఈ 7 నియోజకవర్గాలను తొలగించాలని కోరాను. బందరు పోర్ట్ నిర్మాణంకు రూ. 4500 కోట్లతో పనులు వెంటనే ప్రారంభించాలని సూచించాను. ఈ ప్రాంతవాసిగా కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఆక్వా, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని కోరాను. దేశం మొత్తానికి ఇక్కడి నుంచి వున్న
రహదారులు, రైల్వే కనెక్టివిటీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కమిటీకి సూచించాను

రాజధాని అమరావతి ద్వారా 29 గ్రామాల ప్రజల భూములకు అనూహ్యంగా రేట్లు పెరుగుతాయని చంద్రబాబు నమ్మించాడు.చంద్రబాబు గ్రాఫిక్స్ చూసి రైతులు కూడా మోస పోయారు. నిజంగా అమరావతి నిర్మాణం చేసే పరిస్థితి వుందా అని ఆలోచన చేయకుండా రైతులను చంద్రబాబు మభ్యపెట్టాడు.ఇప్పుడు తన తప్పులను కప్పిపచ్చుకునేందుకు రాజధాని
జెఎసి పేరుతో ఉద్యమం ప్రారంభించాడు.చంద్రబాబు నేను ఏం చేసిన, చెప్పినా జనం నమ్ముతారాని అనుకుంటున్నాడు. రాజధాని అంటే కేవలం అమరావతి అని గతంలో అన్నాడు.ఇప్పుడు మందడం, తుళ్ళూరు, వెంకటాయపాలెం అంటూ 29 గ్రామాలును ప్రస్తావిస్తున్నాడు. ఈ ప్రాంతం లోని ఏ ఒక్క రైతు నష్ట పోకూడదు.రైతులు తమ అభ్యంతరాలను సీఆర్‌డీఏ కమిషనర్ కు ఫిర్యాదు చేయవచ్చు.. కాజా నుంచి గొల్లపూడి మీదిగా అవుటర్ రింగ్ రోడ్ కు ఈ జూన్ నుంచి పనులు ప్రారంభమవుతాయి

Leave a Reply