జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కు పవన్ కల్యాణ్ అభినందనలు

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కు పవన్ కల్యాణ్ అభినందనలు

జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన నటి కీర్తి సురేశ్ కు జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మహానటి’లో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ నటన ఈ అవార్డుకు అర్హమైనదే అని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన తరపున, జన సైనికుల తరపున అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ నిలిచినందుకు చిత్ర బృందానికి, అదే విధంగా ‘రంగస్థలం’, ‘ఆ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

మన సినిమాలు ఏడు పురస్కారాలు దక్కించుకున్న స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.