జగ్గారెడ్డి సహా టీఆర్ఎస్ లో చేరనున్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

జగ్గారెడ్డి సహా టీఆర్ఎస్ లో చేరనున్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Share This

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది. ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ కానున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు గులాబి కండువా కప్పుకోనున్నట్టు, టీఆర్ఎస్ లో చేరేందుకు ఈ నెల 24వ తేదీని వీరు ముహూర్తంగా ఖరారు చేసుకున్నట్టు తాజా సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిన నేపథ్యంలో, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడనుండటం కాంగ్రెస్ కు శరాఘాతమే. శాసనసభలో ప్రతిపక్ష హోదాను సైతం ఆ పార్టీ కోల్పోనుంది. ఈ ముగ్గురు కారెక్కిన తర్వాత శాసనసభలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు మాత్రమే. మరోవైపు టీఆర్ఎస్ బలం 104కు చేరనుంది.