జగన్ పై దాడి చేసిన యువకుడి నేరచరిత్ర!

జగన్ పై దాడి చేసిన యువకుడి నేరచరిత్ర!

జగన్ పై కోడిపందాలకు వాడే కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుపై గతంలోనే కొన్ని పోలీసులు కేసులు నమోదయ్యాయి. కోడిపందాలపై ప్రేమతో చదువుకు మంగళం చెప్పేసిన శ్రీనివాసరావు, కూలీ పనులు చేసుకుని కాలం గడుపుతుండే తాతారావు, సావిత్రిల ఐదో సంతానం. ఠాణేలంకలో పదో తరగతి వరకూ మాత్రమే చదువుకున్నాడు. గత సంవత్సరం కాగిత వెంకటేశ్ అనే యువకుడిపై దాడి చేశాడని ముమ్మిడివరం పోలీసు స్టేషన్ లో ఓ కేసు నమోదై ఉంది. ఇక శ్రీనివాసరావుకు గ్రామంలోని పలువురితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విషయమై గ్రామపెద్దలు పలుమార్లు శ్రీనివాసరావును మందలించినట్టు గ్రామస్తులు అంటున్నారు.