జగన్ పాదయాత్రకు అడుగడుగునా భారీ భద్రత

జగన్ పాదయాత్రకు అడుగడుగునా భారీ భద్రత

  • 17 రోజుల విరామం తర్వాత పాదయాత్రను ప్రారంభించిన జగన్
  • గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీ విభజన
  • పోలీస్ సిబ్బందికి గ్రీన్ కార్డులు

విశాఖ విమానాశ్రయంలో దాడి నేపథ్యంలో, 17 రోజుల విరామం తర్వాత వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈరోజు మళ్లీ ప్రారంభమైంది. విజయనగరం జిల్లా మక్కువ మండలం పాయకపాడు నుంచి జగన్ తన పాదయాత్రను పున:ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జగన్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

అడుగడుగునా పోలీస్ సెక్యూరిటీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీని విభజించారు. జగన్ ను కలుసుకోవాలనుకునే జనాల కోసం రెడ్ కార్డులను ఇష్యు చేశారు. జగన్ ను అనుసరించే ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర సిబ్బందికి బ్లూ కార్డులు, బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందికి గ్రీన్ కార్డులను అందించారు.