జగన్ నంబర్ వన్ ర్యాంకుపై సీబీఐ దగ్గర ప్రశ్నలున్నాయి: నారా లోకేష్ వ్యంగ్యం

  • ఏపీకి ఫస్ట్ ర్యాంకు వస్తుందనే విషయం ఆయనకు తెలుస్తుందని మనం ఎలా అనుకోగలం
  • అవినీతి, దందాలు గురించైతే తెలుస్తుంది
  • జగన్ అవినీతికి సంబంధించిన ప్రశ్నలు సీబీఐ వద్ద ఉన్నాయి

సులభతర వాణిజ్యం అంశంలో ఏపీకి దేశంలోనే తొలి స్థానం దక్కడంపై వైసీపీ అధినేత జగన్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సులభతర వాణిజ్యంలో ఏపీ ర్యాంక్ సాధిస్తుందనే విషయం దొంగబ్బాయికి తెలుస్తుందని మనం ఎలా ఊహించగలమని అన్నారు.

అవినీతి లేదా దందాలు చేయడం గురించైతే ఆయనకు తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఏపీకి ఫస్ట్ ర్యాంకు రావడంపై జగన్ ప్రశ్నించడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని… అవినీతిలో జగన్ ఫస్ట్ ర్యాంకుకు సంబంధించిన ప్రశ్నలు సీబీఐ వద్ద ఉన్నాయని అన్నారు.