జగన్ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం: ఓవీ రమణ

జగన్ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం: ఓవీ రమణ

వైసీపీ అధినేత జగన్ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని టీటీడీ మాజీ సభ్యుడు ఓవీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుందని అన్నారు. జగన్ ముందడుగు వేస్తే జేడీఎస్ అధినేత దేవెగౌడ కూడా సిద్ధంగా ఉన్నారని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడమే గౌడ ఎజెండా అని అన్నారు. దేవెగౌడను తానే ప్రధానిని చేశానని చంద్రబాబు చెప్పుకోవడం అవివేకమని, దక్షిణాది నుంచి ప్రధాని కావాలనే ఆయన్ని నాడు అందరూ కలసి ఎన్నుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. దేవెగౌడ కుటుంబానికి రమణ సన్నిహిత మిత్రుడు.